
కన్నడ భామ షర్మిల మాండ్రే తెలుగులో ఆరంగేట్రం చెయ్యడానికి సిద్దమయ్యింది. అల్లరి నరేష్ రాబోతున్న చిత్రం “కెవ్వు కేక” చిత్రంతో ఈ భామ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ నెలలో మొదలు కానున్న ఈ చిత్ర చిత్రీకరణలో షర్మిల మాండ్రే నవంబర్ నుండి పాల్గొంటుంది. గతంలో ఈ నటి “సజ్ని”,కృష్ణ” మరియు “నవగ్రహ” వంటి కన్నడ చిత్రాలలో కనిపించింది. ఈ మధ్యనే తమిళంలో “మిరట్టల్” అనే చిత్రంలో కనిపించి అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇప్పుడు తెలుగు తెర వంతు వచ్చింది ఇక్కడ కూడా తన అందాలతో యువతను, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఈ భామ అల్లరినరేష్ చిత్రంతో ఇటుగా వచ్చేయనుంది. గతంలో అల్లరి నరేష్ తో “బ్లేడ్ బాబ్జి” చిత్రంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన దేవి ప్రసాద్ మరోసారి జనాన్ని థియేటర్లలో పొట్టచెక్కలయ్యేలా నవ్వించడానికి “కెవ్వు కేక” తో సిద్దమయ్యారు బోపన్న చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రాజ్,భీమస్ మరియు చిన్ని రాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం పూర్తి వినోదాత్మక చిత్రంగా ఉండబోతుంది. అనిల్ సుంకర దర్శకత్వంలో రానున్న 3డి చిత్రం “యాక్షన్ 3డి” చిత్రీకరణలో ప్రస్తుతం అల్లా నరేష్ బిజీగా ఉన్నారు.
అల్లరి నరేష్ తో కెవ్వు కేక పెట్టనున్న కన్నడ భామ
అల్లరి నరేష్ తో కెవ్వు కేక పెట్టనున్న కన్నడ భామ
Published on Oct 3, 2012 1:53 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఆదిపురుష్’ లానే ‘రామాయణ’లో ఈ తప్పులు సరి చేస్తారా?
- “విశ్వంభర” మరింత ఆలస్యం!?
- ‘బైకర్’ పై ‘పెద్ది’ ప్రశంసలు! యూనిక్ అటెంప్ట్ అంటూ..
- ‘రామాయణ’ కోసం రెహమాన్ కి షాకింగ్ రెమ్యునరేషన్?
- తన గ్లామ్ షోతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ‘డెకాయిట్’ బ్యూటీ!
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్
- ‘పెద్ది’ నైజాం రైట్స్ కి భారీ మొత్తం ?
- ‘రామాయణ’ పై విమర్శలకు హృతిక్ జవాబు !
- ‘రుద్ర – మందాకిని’ల సీన్స్ పై రాజమౌళి ఫోకస్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : బైకర్ – రేసింగ్ ట్రాక్‌పై శర్వానంద్, రాజశేఖర్ల ఎమోషనల్ రైడ్
- సమీక్ష: రాకాస – డీసెంట్ గా సాగే కామెడీ హారర్ డ్రామా
- ట్రెండ్ సెట్ చేస్తున్న సూర్య.. ‘వీరభద్రుడు’గా మారిన కరుప్పు..!
- ట్రైలర్ టాక్ : ప్రేమ, నమ్మకద్రోహం, విధ్వంసం.. ‘డెకాయిట్’ సాలిడ్ ట్రీట్ ఖాయం..!
- ‘జైలర్ 2’పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన తలైవా..!
- ‘రామాయణ’ కోసం రెహమాన్ కి షాకింగ్ రెమ్యునరేషన్?
- సమీక్ష : లీడర్ – రెగ్యులర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ !
- “విశ్వంభర” మరింత ఆలస్యం!?

