
ప్రతి శుక్రవారం ఏదో ఒక పెద్ద సినిమాతో బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేసే టాలీవుడ్ ఈ వారం మూగబోయింది. ఇదే అదును కావడంతో టాలీవుడ్ బాక్స్ ఆఫీసుపై మూడు డబ్బింగ్ సినిమాలు దాడి చేయనున్నాయి. అందులో మొదటగా దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఇండియన్ ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రీ దేవి ప్రధాన పాత్రలో నటించిన ‘ ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రం వస్తుంది. చాలా కాలం తర్వాత శ్రీ దేవి నటించిన సినిమా కావడంతో ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులు బాగానే ఆసక్తి చూపుతున్నారు. రెండవ సినిమాగా చెప్పుకోవాల్సింది విక్రమ్ మరియు అనుష్క జంటగా నటించిన ‘శివతాండవం’. ఈ చిత్రంలో విక్రమ్ అంధుడి పాత్ర చేయడం, జగపతి బాబు, అమీ జాక్సన్ మరియు లక్షీ రాయ్ ప్రధాన పాత్రలు పోషించడం వల్ల ఈ చిత్రానికి కూడా కొంత క్రేజ్ ఉంది. చివరిగా మూడవ సినిమా విషయానికొస్తే ‘రోజా పూలు’, ‘ఒకరికి ఒకరు’ చిత్రాల ద్వారా తెలుగు వారికి సుపరిచితుడైన శ్రీ రామ్ హీరోగా, పార్వతి మీనన్ హీరోయిన్ గా ‘మల్లి vs రవితేజ’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాలలో ఏ చిత్రం తెలుగు వారిని ఆకట్టుకుంటుందో? బాక్స్ ఆఫీసు వద్ద ఎన్ని కాసులు రాల్చుకుంటాయో? లేదో? చూద్దాం.
టాలీవుడ్ బాక్స్ ఆఫీసుపై డబ్బింగ్ సినిమాల దాడి
టాలీవుడ్ బాక్స్ ఆఫీసుపై డబ్బింగ్ సినిమాల దాడి
Published on Oct 4, 2012 4:00 PM IST
సంబంధిత సమాచారం
- ‘రామాయణ’ క్లైమాక్స్ పై క్రేజీ న్యూస్ !
- స్పెషల్ సాంగ్ కోసం మెగాస్టార్ స్టైలిష్ లుక్ !
- ‘గాడ్ ఆఫ్ వార్’ సరికొత్త వరల్డ్.. విఎఫ్ఎక్స్ పై ప్రత్యేక దృష్టి !
- ‘అఖిల్’ తదుపరి కథ పై కొత్త చర్చ !
- ‘జైలర్ 2’తో క్లాష్ నుంచి తప్పుకున్న ధనుష్.. కానీ హ్యాట్రిక్ హీరోతో రెడీ?
- ‘ఫౌజీ’ లేటెస్ట్ పోస్టర్ లో ఆ నటుడు.. మరో ఇంట్రెస్టింగ్ డీటెయిల్?
- వైరల్ వీడియో: కూతురి చేయి పట్టి కన్నీటి పర్యంతమైన బండ్ల గణేష్!
- ‘ఇరుముడి’ నుంచి అవైటెడ్ చార్ట్ బస్టర్ వచ్చేసింది.. రవితేజ మాస్ ఎనర్జీతో ట్రాన్స్
- ‘రామాయణ’ 4000 వేల కోట్ల బడ్జెట్ పై క్లారిటీ ఇచ్చిన యష్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- క్రేజీ కలయిక పై నెటిజన్ల ఆసక్తి !
- సమీక్ష: హుషార్ పిట్టలు – కొన్ని సీన్స్ ఇబ్బంది పెట్టినా సందేశం బాగుంది
- బాక్సాఫీస్ దగ్గర సంజయ్ విశ్వనాథ్ బ్యాటింగ్.. 2 రోజుల్లో సెంచరీ!
- ‘ఇరుముడి’ నుంచి అవైటెడ్ చార్ట్ బస్టర్ వచ్చేసింది.. రవితేజ మాస్ ఎనర్జీతో ట్రాన్స్
- కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పడే..!

