
ప్రస్తుతం తమిళనాడులో భారీ క్రేజ్ ఉన్న చిత్రం “తుపాకి”. విజయ్ మరియు మురగదాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రం తెలుగు పంపిణి హక్కుల కోసం తెలుగులో నిర్మాతల్లో పెద్ద పోటీనే నెలకొంది. చివరగా ఈ చిత్రాన్ని శోభారాణి దక్కించుకున్నారు. గతంలో “సూర్య సన్ ఆఫ్ కృష్ణన్” మరియు “దశావతారం” వంటి భారీ చిత్రాలను అందించిన ఎస్వీఆర్ మీడియా వారు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చెయ్యనున్నారు. ఈ చిత్ర అనువాద హక్కులను వీరు 15 కోట్లు ఇచ్చి కొన్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ మరియు కాజల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి తెలుగులో కూడా “తుపాకి” అనే పేరుని పెట్టారు. హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. దీపావళి రేస్ లో ఈ చిత్రం ఎంతవరకు విజయం సాదిస్తుందో చూడాలి.
భారీ మొత్తానికి అమ్ముడుపోయిన “తుపాకి” తెలుగు రైట్స్
భారీ మొత్తానికి అమ్ముడుపోయిన “తుపాకి” తెలుగు రైట్స్
Published on Oct 8, 2012 9:35 PM IST
సంబంధిత సమాచారం
- ఓటిటి సమీక్ష: ‘గమ్యం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- DC ఒక తమిళ్ క్లాసిక్: మహేష్ బాబు తర్వాత ‘డీసీ’ మూవీకి అల్లు అర్జున్ ఫిదా
- Nizam Collections : నైజాంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా: 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దిశగా మూవీ!
- రాజంపేటలో ‘డేవిడ్ రెడ్డి’ క్లైమాక్స్ !
- పీరియాడిక్ నేపథ్యంలో శర్వా కొత్త సినిమా ?
- ‘రామాయణ’ క్లైమాక్స్ పై క్రేజీ న్యూస్ !
- స్పెషల్ సాంగ్ కోసం మెగాస్టార్ స్టైలిష్ లుక్ !
- ‘గాడ్ ఆఫ్ వార్’ సరికొత్త వరల్డ్.. విఎఫ్ఎక్స్ పై ప్రత్యేక దృష్టి !
- ‘అఖిల్’ తదుపరి కథ పై కొత్త చర్చ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- క్రేజీ కలయిక పై నెటిజన్ల ఆసక్తి !
- ‘ఇరుముడి’ నుంచి అవైటెడ్ చార్ట్ బస్టర్ వచ్చేసింది.. రవితేజ మాస్ ఎనర్జీతో ట్రాన్స్
- బాక్సాఫీస్ దగ్గర సంజయ్ విశ్వనాథ్ బ్యాటింగ్.. 2 రోజుల్లో సెంచరీ!
- మిస్టీరియస్ క్రైమ్ థ్రిల్లర్ ‘ది రెడ్ బ్యాగ్’ రిలీజ్ డేట్ లాక్.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ద్వారా!
- మహేష్, ప్రభాస్ ఫెయిల్.. బన్నీ అయినా చేస్తాడా..?
- ‘జైలర్ 2’తో క్లాష్ నుంచి తప్పుకున్న ధనుష్.. కానీ హ్యాట్రిక్ హీరోతో రెడీ?
- ‘లెనిన్’ సక్సెస్.. అఖిల్ సైలెంట్.. ఎందుకో..?
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’.. ఎప్పుడు, ఎందులో అంటే!

