నాగార్జున “డమరుకం” చిత్రం ఎట్టకేలకు విడుదల తేదీ ఖరారు చేసుకుంది. ఈ చిత్రం కోసం అభిమానుల ఎదురుచూపు ముగియనుంది చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం నవంబర్ 9న విడుదల కానుంది. ఈ చిత్రం అక్టోబర్ 24న విడుదల కావలసింది కాని పలు కారణాల మూలాన వాయిదా పడుతూ వచ్చింది. తరువాత ఈ చిత్రం విడుదల మీద ఎవరికీ క్లారిటి లేకుండాపోయింది. కాని అన్ని సమస్యలు తీరిపోయినట్టు తెలుస్తుంది ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు ఇప్పటికే జరుపుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ వారు U /A సర్టిఫికేట్ ఇచ్చారు. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని వెంకట్ ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో నాగార్జున మరియు అనుష్క ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి పరిశ్రమలో సానుకూల స్పందన ఉంది చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టుతుందని అంటున్నారు. భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా ఈ చిత్రం విడుదల అవ్వాలని కోరుకుందాం.
నాగార్జున డమరుకం వచ్చేస్తుంది
నాగార్జున డమరుకం వచ్చేస్తుంది
Published on Nov 3, 2012 10:54 PM IST
సంబంధిత సమాచారం
- రవితేజ ‘ఇరుముడి’ సెన్సార్ పూర్తి: సర్టిఫికెట్.. రన్టైమ్ డీటెయిల్స్!
- Official : సందీప్ కిషన్, జాసన్ సంజయ్ ‘సిగ్మా’ రిలీజ్ డేట్ ఖరారు
- పోల్: సూర్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో మీకేది బాగా నచ్చింది?
- మెగాస్టార్ బర్త్ డే బ్లాస్ట్.. 158వ సినిమా టైటిల్ టీజర్ కి ఊహించని ప్లానింగ్!
- బాలయ్య క్రేజీ ప్రాజెక్ట్ నిలిచిపోయిందా? మొత్తానికి క్లారిటీ!
- ఫ్యాక్షన్ టైటిల్ తో రాబోతున్న వెంకీ మామ, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్
- ‘సలార్ 2’ ఎట్టి పరిస్థితుల్లో అప్పుడే!
- మల్లెపూల పల్లకిలో చరణ్ కామియో.. అసలు క్లారిటీ బయటకి
- అక్కడ మంచి బజ్తో మొదలైన ‘ఇరుముడి’ బుకింగ్స్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- IND vs SL 1st Test: గాలె టెస్టులో టీమిండియా పట్టు.. లంకపై స్పిన్నర్ల పంజా.. భారత్కు భారీ లీడ్
- Nizam Collections : నైజాంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా: 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దిశగా మూవీ!
- ‘జైలర్ 2’తో క్లాష్ నుంచి తప్పుకున్న ధనుష్.. కానీ హ్యాట్రిక్ హీరోతో రెడీ?
- ‘అఖిల్’ తదుపరి కథ పై కొత్త చర్చ !
- అనిరుధ్, కావ్యల వివాహం.. డేట్, వెన్యూ ఫిక్స్ అయ్యిందా..?
- డైరెక్టర్గా మారిన హీరో.. అయినా వదలని ఫ్లాప్ సెంటిమెంట్..!
- ‘రామాయణ’ క్లైమాక్స్ పై క్రేజీ న్యూస్ !
- ఎన్టీఆర్తో వెంకీ అట్లూరి కాంబినేషన్.. సెట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్..!

