‘వరల్డ్ ఫేమస్ లవర్’ రెండు షెడ్యూల్స్ కోసం.. !

‘వరల్డ్ ఫేమస్ లవర్’ రెండు షెడ్యూల్స్ కోసం.. !

Published on Sep 23, 2019 8:29 PM IST

world

సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ నుండి ఇటీవలే వచ్చిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా నుండి ఒక లేటెస్ట్ అప్ డేట్ తెలిసింది, ఈ సినిమాకి సంబంధించి రెండు కీలకమైన షెడ్యూల్స్ ను యూరప్ మరియు హైదరాబాద్ లలో షూట్ చేయడానికి డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడు. వచ్చే నెల రెండో వారం నుండి ఈ షెడ్యూల్స్ మొదలవుతాయని తెలుస్తోంది. కె.ఎస్‌.రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియల్స్ బ్యాన‌ర్‌ పై కె.ఎ.వ‌ల్ల‌భ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

కాగా ఈ రొమాంటిక్ ట్ర‌యాంగిల్ ల‌వ్‌ ఎంట‌ర్ టైన‌ర్‌లో విజయ్ దేవరకొండ సరసన రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్‌,, క్యాథెరిన్ థెరిస్సా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. మొత్తానికి టైటిల్ బాగా క్యాచీగా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ గత చిత్రం డియర్ కామ్రేడ్ ఆశించిన విజయం సాధించలేక పోయింది. దాంతో విజయ్ దేవరకొండ ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు