ఆ విషయంలో సైరా.. బాహుబలి కంటే ఎక్కువే.

ఆ విషయంలో సైరా.. బాహుబలి కంటే ఎక్కువే.

Published on Sep 23, 2019 11:33 PM IST

syeraa4

టాలీవుడ్ నుండి వస్తున్న మరో భారీ ప్రతిష్టాత్మక చిత్రం సైరా. దాదాపు 250కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సైరా పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొనిఉన్నాయి . విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ పీరియాడిక్ చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను చిరంజీవి చేస్తుండగా రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. వచ్చేనెల 2న గాంధీ జయంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం చిత్ర నిడివిని యూనిట్ సభ్యులు ఫిక్స్ చేశారని సమాచారం. సైరా మూవీ నిడివి 2 గంటల 44నిమిషాలుగా నిర్ణయించారని సమాచారం.

సైరా పీరియాడిక్ మూవీ కావడంతో ఈ మాత్రం నిడివి చాలా అవసరం. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్ర నిడివి 158 నిముషాలు కాగా, బాహుబలి 2 చిత్ర నిడివి 171 నిముషాలు. సైరా ఈ రెండింటికి మధ్యస్తంగా 164నిమిషాల రన్ టైం కలిగి ఉంది. కాబట్టి సైరా రన్ టైం బాహుబలి కంటే ఎక్కువ, బాహుబలి 2కంటే తక్కువని చెప్పుకోవచ్చు. అలాగే సైరా చిత్రానికి యూ/ఏ సెన్సార్ సర్టిఫికేట్ రానున్నట్టు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు