ఓవర్సీస్లో మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో నాని కూడా ఒకరు. తాజాగా విడుదలైన ఆయన కొత్త చిత్రం ‘గ్యాంగ్ లీడర్’ ప్రీమియర్ల ద్వారా 200,132 డాలర్లు వసూలు చేసి మొదటి వారాంతానికి 630,860 డాలర్లను ఖాతాలో వేసుకుంది. ఇక ఐదు రోజులకే ఆ కలెక్షన్స్ 821,607కు చేరడంతో సులభంగానే మిలియన్ మార్క్ చేరుకుంటుందని అంతా అనుకున్నారు.
కానీ పరిస్తితి పూర్తిగా తారుమారైంది. బుధవారం నుండి సినిమా వసూళ్లు బాగా తగ్గాయి. మధ్యలో ‘గద్దలకొండ గణేష్’ విడుదలకావడం వసూళ్ల మీద మరింత ప్రభావాన్ని చూపింది. దీంతో రెండవ వీకెండ్ ముగిసేనాటికి చిత్రం 915,900 డాలర్లకే పరిమితమైంది. దీన్నిబట్టి చిత్రం మిలియన్ మార్కును అందుకోవడం అసాధ్యమనిపిస్తోంది.


