‘ఎఫ్ 2’ సినిమాతో హి ఈజ్ బ్యాక్ అనిపించుకున్న విక్టరీ వెంకటేష్ జాగ్రత్తగా సినిమాల్ని ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ ప్రాజెక్ట్ చేస్తున్న ఈ సీనియర్ హీరో దర్శకులు తరుణ్ భాస్కర్, త్రినాథరావ్ నక్కిన ప్రాజెక్ట్స్ ఓకే చేశారట.
వాటిలో ముందుగా తరుణ్ భాస్కర్ సినిమా మొదలవుతుందని అంటున్నారు. ఈ సినిమా హార్స్ రెసింగ్ నెపథ్యంలో సాగుతుందిని వినికిడి. చాలా వరకు సినిమాను మలక్ పేట్ రేస్ క్లబ్బులో చిత్రీకరిస్తారట. మరి ఈ వార్తల్లో ఏమేరకు నిజముందో తెలియాలంటే ఆఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే. ఇకపోతే ఈ చిత్రాన్ని వెంకీ హోమ్ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది.


