ఆయనతో నాకు మంచి జ్ఞాపకాలు ఉన్నాయి – అనుష్క

ఆయనతో నాకు మంచి జ్ఞాపకాలు ఉన్నాయి – అనుష్క

Published on Sep 26, 2019 2:30 AM IST

Anushka Shetty

ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ కొద్దిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూశారు. ఆయన మరణం పట్ల తెలుగు చిత్ర సీమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయనతో కలిసి పనిచేసిన ప్రముఖులు చాలామంది ఆనాటి జ్ఞాపకాలను తలచుకుని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా అనుష్క శెట్టి వేణుమాధ‌వ్ అకాల మ‌ర‌ణం పై దిగ్ర్భాంతిని వ్య‌క్తం చేస్తూ తన ఫేస్‌బుక్‌ పేజీలో వేణు మాధవ్ తో తనకున్న జ్ఞాపకాలకు సంబంధించిన వీడియోని షేర్ చేసి.. ఆయన కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలియజేశారు.

అనుష్క పోస్ట్ చేస్తూ.. ‘‘వేణు మాధవ్‌ గారి మ‌ర‌ణవార్త గురించి తెలియగానే నాకు చాలా బాధ కలిగింది. ఆయనతో నాకు నా ఫస్ట్ మూవీ ‘సూపర్‌’ నుండే మంచి పరిచయం ఉంది. మేం కలిసి నటించాం. ఆయనతో నాకు మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన టాలెంట్ ను కలిగిన బెస్ట్ కమెడియన్స్ లో వేణు మాధవ్ గారు ఒకరు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని అనుష్క పోస్ట్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు