సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల డియర్ కామ్రేడ్ చిత్రంతో సందడి చేశారు. ఆ చిత్రం ఫలితం ఎలా ఉన్నా విజయ్ రష్మిక మధ్య కెమిస్ట్రీ మరియు వారి నటన హై లైట్ అయ్యింది. కాగా నిన్న ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కొరకు విచ్చేసిన విజయ్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. గతానికి భిన్నంగా ఆయన ట్రిమ్డ్ షేవ్, డిఫరెంట్ గాగుల్స్ ధరించి కొత్తగా కనిపించారు. దాదాపు ఏడాదికి పైగా విజయ్ బాగా పెరిగిన గడ్డంలో కనిపిస్తున్నారు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. మరి ఆ చిత్రం కొరకు విజయ్ ఈ లుక్ లోకి మారాడా అని అనిపిస్తుంది. ఐతే విజయ్ న్యూ లుక్, ఫొటో వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ ఈ చిత్రంతో పాటు, డైనమిక్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో ఈ మూవీ సెట్స్ పైకెళ్లే అవకాశం కలదు.


