ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ దర్శక ధీరుడు రాజమౌళితో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్న “RRR” సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అలాగే ఇప్పుడు తన తండ్రి నటించిన భారీ బడ్జెట్ మరియు పీరియాడిక్ డ్రామా “సైరా నరసింహా రెడ్డి” చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు.అయితే తాజాగా చెన్నైలో జరుగుతున్న ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ తనను ఈ మధ్య కాలంలో ఎమోషనల్ గా కంటతడి పెట్టించిన సినిమా కోసం ప్రస్తావించారు.
తాను ఇప్పుడు నిర్మాతగా తెరకెక్కించిన “సైరా” లో ఓ కీలక పాత్ర పోషించిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన “96” సినిమా చూసి కంటతడి పెట్టుకున్నానని,ఆ చిత్రంలో విజయ్ సేతుపతి నటన తనను అమితంగా ఆకట్టుకుందని తనని మొదటిసారి కలిసినపుడు ఒక నిమిషం పాటు హత్తుకుని విజయ్ కు అభినందనలు తెలిపానని వెల్లడించారు.మొత్తానికి ఈ విధంగా రామ్ చరణ్ విజయ్ సేతుపతి నటనకు అభిమానిగా మారిపోయారు అని చెప్పాలి.రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం మొత్తం ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ అక్టోబర్ 2 న భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది.


