బన్నీకి బ్రదర్‌ని కాదంటున్న యంగ్ హీరో

బన్నీకి బ్రదర్‌ని కాదంటున్న యంగ్ హీరో

Published on Sep 29, 2019 5:02 PM IST

Allu arjun

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో యంగ్ హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంగతి తెలిసినప్పటి నుండి సుశాంత్ బన్నీకి సోదరుడిగా నటిస్తున్నాడని కొందరంటే.. లేదు పూజా హెగ్డేకు అన్నయ్యగా కనిపిస్తాడని ఇంకొందరు చెప్పుకొచ్చారు.

కానీ సుశాంత్ మాత్రం బన్నీకి బ్రదర్‌ని కాదు.. అదృష్టవశాత్తు పూజా హెగ్డేకు కూడా అన్నయ్యను కాదు. అసలు నా పాత్ర ఏమిటో తెలుసుకోవాలంటే కాస్త వెయిట్ చేయండి అన్నారు. ఇకపోతే వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదలకానున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ప్రమోషనల్ సాంగ్ ‘సామజవరగమన’ మంచి హిట్టైంది కూడా.

హారికా అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇంకా టబు, జయరామ్, నివేత పేతురాజ్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు