బాలయ్య సినిమాల లైనప్ బంపర్ కదా అసలు

బాలయ్య సినిమాల లైనప్ బంపర్ కదా అసలు

Published on Sep 29, 2019 9:00 PM IST

Balakrishna1

నందమూరి బాలకృష్ణ తన తర్వాతి సినిమాల్ని చాలా చక్కగా సెట్ చేసుకున్నారు. ప్రస్తుతం తన 105వ చిత్రాన్ని కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో చేస్తున్న బాలయ్య 106వ సినిమాను బోయపాటి శ్రీనుతో, 107వ చిత్రాన్ని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తికాకముందే 108వ సినిమాను కూడా ఫైనల్ చేసుకున్నారట ఆయన. ఈ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేయనున్నారని ఫిల్మ్ నగర్ టాక్.

గతంలో క్రిష్ బాలయ్యతో చేసిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మంచి చిత్రంగా నిలవగా ఈమధ్య ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో చేసిన ‘కథానాయకుడు, మహానాయకుడు’ చిత్రాలు అంతగా మెప్పించలేదు. ఈ సినిమాల తర్వాత మరొక ప్రాజెక్ట్ చేయని క్రిష్ బాలయ్యతో మళ్లీ వర్క్ చేయడానికి సిద్దమవడం విశేషం. మొత్తానికి నటసింహం సినిమాల లైనప్ బంపర్ అనేలానే ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు