గత రాత్రి బిగ్ బాస్ షో కొంచెం రసవత్తరంగా జరిగింది. మొదటినుండి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరైన సీరియల్ ఆర్టిస్ట్ రవి కృష్ణ ఎలిమినేట్ కావడమే ఇందుకు కారణం. బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్స్ ద్వారా బాగా దగ్గరైన నటుడు రవి కృష్ణ. ఆయనకు ఒక తరగతి వర్గం యొక్క మద్దతు ఉండటంతో పాటు, ఆకట్టుకొనే ప్రదర్శనతో టైటిల్ విన్నర్స్ లో ఒకరుగా ఉంటూ వచ్చారు. ఐతే అనూహ్యంగా నిన్న ఆయన బిగ్ బాస్ హౌస్ కి బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మొదటి నుండి శ్రీముఖి, వరుణ్, బాబా భాస్కర్, రవి కృష్ణ టైటిల్ హాట్ పేవరేట్స్ గా విన్నర్స్ లిస్ట్ లో ఉంటూ వచ్చారు. ఐతే ఈ నలుగురే ఈ వారం ఎలిమినేషన్స్ లో నామినేట్ కావడంతో ఒకరు తప్పకుండా వెళ్లిపోవాల్సిన పరిస్థితి. ఈ విధంగా చూస్తే టైటిల్ పేవరేట్స్ లో కేవలం ముగ్గురే మిగిలినట్టు లెక్క. వరుణ్, శ్రీముఖి, బాబా భాస్కర్ల లో ఒకరు టైటిల్ గెలుస్తారనే వాదన గట్టిగా వినిపిస్తుంది. మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అలీ రైజా రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయనకు గెలుపు అవకాశాలు తక్కువనే చెప్పాలి. దానికి కారణం ఒకసారి బయటికి వెళ్లొచ్చిన అలీ రెజా గెలిస్తే షో విమర్శలపాలయ్యే అవకాశం కలదు. అంచనాలకు అతీతంగా నడిచే బిగ్ బాస్ షోలో ఏమైనా జరగొచ్చు.


