ప్రీ రిలీజ్ బిజినెస్ లో దుమ్మురేపిన సైరా

ప్రీ రిలీజ్ బిజినెస్ లో దుమ్మురేపిన సైరా

Published on Oct 1, 2019 8:44 AM IST

Syeraa1

మెగాస్టార్ చిరంజీవి ఇంకొద్ది గంటలలో సైరా నరసింహారెడ్డిగా థియేటర్లలో దిగనున్నారు. హీరో రాంచరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సైరా పై భారీ అంచనాలున్నాయి. హిందీ,తెలుగు,కన్నడ, తమిళ, మలయాళ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 2న విడుదలవుతున్న సైరా చిత్రం కొరకు అటు మెగా అభిమానులు, ఇటు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్స్, టీజర్స్ మూవీపై అంచనాలు ఆకాశానికి చేర్చాయి. సైరా పై ఉన్న అంచనాల రీత్యా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగినట్టు తెలుస్తుంది.

బాహుబలి, సాహో చిత్రాల తరువాత ఆ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా సైరా నిలిచింది. సైరా తెలుగు వర్షన్ హక్కులే ప్రపంచ వ్యాప్తంగా 150కోట్లకు అమ్ముడుబోయాయని తెలుస్తుంది. రెండు తెలుగు తెలుగు రాష్ట్రాలలో 108కోట్ల వరకు బిజినెస్ చేసిన సైరా, కర్ణాటకలో 27కోట్ల వరకు బిసినెస్ జరిపినట్లు సమాచారం. ఇక తమిళనాడు, కేరళ, నార్త్ ఇండియాలో స్థానిక డిస్ట్రిబ్యూటర్స్ తో కలిసి సొంతగా మూవీని విడుదల చేస్తున్నారట. ఓవర్ సీస్ లో 18కోట్ల వరకు బిజినెస్ చేసిన సైరా ఓవరాల్ గా 150కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది. ఇక హిందీ, కన్నడ, మలయాళ,తమిళ విడుదల హక్కులు కలుపుకుంటే ఇది మరింత పెరిగే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు