తెలుగువారికి బిగ్ బాస్ రియాలిటీ షో పరిచయమై మూడేళ్లు. కొందరు ప్రముఖులను ఒక ఇంటిలోకి పంపించి, వివిధ చర్యల ద్వారా సదరు వ్యక్తుల ప్రవర్తనా విధానం చూపించడమే ఈ షో యొక్క ముఖ్య ఉద్దేశం. హౌస్ లో వారి ప్రతి కదలికను, మాటను, చర్యను ప్రేక్షకులకు చూపిస్తూ వారి పట్ల ప్రేక్షకులు ఒక అభిప్రయానికి రావడం, దాని ఆధారంగా హౌస్ లో ఎవరు ఉండాలి, ఎవరిని బయటకి పంపించాలి అనేది ఓట్ల ద్వారా నిర్ణయించడం షో నిబంధన.
కానీ షో నిబంధనల ప్రకారం జరుగుతుందా…?షోలో కంటెస్టెంట్స్ ని ప్రేక్షకుల ఓటింగ్ ప్రాదిపతికనే ఉంచడం లేదా పంపించడం చేస్తున్నారు అనడానికి ఆధారాలు ఏమిటి? ఒక వ్యక్తిని ఎలిమినేట్ చేయడానికి వీరు తీసుకుంటున్న ప్రామాణికత ఏమిటి ? అనేది అస్పష్టం. షోలో కొందరు వ్యక్తులపై మానసిక దాడి చేయించడం, అలాగే షో నిర్వాహకులు ఎలిమినేషన్ విషయంలో ప్రేక్షకుల అభిప్రాయం పాటించడం లేదు అనేది కొందరి వాదన.
దానికి కారణం అత్యంత ప్రజాదరణ కలిగిన టఫ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుంటే అసలు ఏమాత్రం జనరంజకమైన ప్రవర్తన లేని కొందరు సభ్యులు ఏవారానికి ఆవారం పొడిగించబడుతూ షోలో కొనసాగుతున్నారు. అలాగే తనదైన బాడీ లాంగ్వేజ్, మాట తీరు కలిగి ఫెవరేట్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్న బాబా భాస్కర్ ని ఇంటి నుండి బయటికి పంపే తంతు సిద్ధమైందని సమాచారం. ఇప్పటికే షోలోని కొందరు సభ్యులు అతనిని టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.
వారిప్రయోజనాలకు,ఇష్టాలకు అనుకూలంగా షో నడిపించుకుంటూ ప్రేక్షకులను భాగస్వామ్యం చేస్తున్నాం అంటూ ప్రజలను పిచ్చివాళ్లను చేస్తున్నారనిపిస్తుంది. నిజంగా బిగ్ బాస్ నిర్వాహకులకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలందరికీ తెలిసిన వేదిక ద్వారా ఎలిమినేట్ అయ్యేవారు అలాగే విజేతలను నిర్ణయించాలి. అలా కాకుండా ఒక పారదర్శకత లేకుండా ఇలా షో నిర్వహిస్తే రాబోయే సీజన్స్ ప్రజాదరణకు నోచుకోవు.


