మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘సైరా’ చిత్రం ఈరోజే విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్లో సైతం క్రేజ్ విపరీతంగా ఉండటంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లు హెవీగా ప్రీమియర్ షోలు ఏర్పాటుచేశారు. దీంతో ప్రీమియర్ కలెక్షన్స్ భారీస్థాయిలోనే ఉన్నాయి.
ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు యూఎస్ కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల వరకు 270 లొకేషన్లలో 750,000 డాలర్లు వసూలైనట్టు తెలుస్తోంది. అన్ని లొకేషన్లలోని ప్రీమియర్ వసూళ్లను కలుపుకుంటే ఈ మొత్తం మిలియన్ మార్క్ అందుకోవడం ఖాయమని అంటున్నారు. ఈ కలెక్షంన్స్ చూస్తుంటే అమెరికాలో మెగా మేనియా ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.
ఇక ఏపీ, తెలంగాణల్లో సైతం మొదటిరోజు వసూళ్లు రికార్డ్ స్థాయిలో ఉంటాయని, అవి చిరు కెరీర్లోనే ఉత్తమమైనవిగా నమోదవుతాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.


