మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి నిన్న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైరా చిత్రంకు మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి. మూవీ పై ఉన్న హైప్ దృష్ట్యా యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ కూడా సైరా సత్తా చాటింది.
మంగళవారం ప్రీమియర్స్ ద్వారా $8,17,0000 డాలర్ల వసూళ్లు రాబట్టిన సైరా నార్త్ అమెరికా ఐనా కెనడాలో మరో $40,122 ప్రీమియర్ కలెక్షన్స్ తో మొత్తంగా $8,57,000 గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇక నిన్న బుధవారం సాయంత్రం 3:30 వరకు 250 లొకేషన్స్ నుండి $1,45,000 డాలర్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు సమాచారం. దీనితో మొత్తంగా వన్ మిలియన్ వసూళ్లను సైరా తక్కువ సమయంలో సాధించింది. హిట్ టాక్ నేపథ్యంలో రాబోయే వారాంతపు సెలవులలో సైరా వసూళ్లు మరింత పెరిగే అవకాశం కలదు.
చిరంజీవి మొదటిసారి ఒక స్వాతంత్ర్య సమరయోధుడిగా నటించిన సైరా చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించగా హీరో రామ్ చరణ్ నిర్మించారు. నయనతార, తమన్నా, అమితాబ్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, సుదీప్ కీలక పాత్రలు చేయడం జరిగింది.


