మొదటి రోజే 50కోట్ల వసూళ్లు,దుమ్మురేపిన సూపర్ హీరోస్

మొదటి రోజే 50కోట్ల వసూళ్లు,దుమ్మురేపిన సూపర్ హీరోస్

Published on Oct 3, 2019 8:36 AM IST

war

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ లో నిన్న విడుదలైన వార్ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ టాప్ లేపింది. మొదటిరోజే దాదాపు 50కోట్ల కు పైగా గ్రాస్ వసూళ్లతో అల్ టైం హైయెస్ట్ గ్రాస్సింగ్ రికార్డ్ దిశగా పోతుంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ మూవీ దేశవ్యాప్తంగా ట్రెమండస్ రెస్పాన్స్ అందుకుంది. ఇండియన్ ఏజెంట్స్ అయిన ఇద్దరు హీరోల మధ్య నడిచే యాక్షన్ వార్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయినట్టు తెలుస్తుంది.

ఈ మధ్య కమర్షియల్ మూవీస్ వదిలేసి కాన్సెప్ట్ బేస్డ్ ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్న హృతిక్ చాలా కాలం తరువాత తన స్థాయి కమర్షియల్ హిట్ అందుకునేలా కనిపిస్తున్నారు. హిందీలో ఇప్పటివరకు 52కోట్ల మొదటిరోజు గ్రాస్ కలెక్షన్స్ తో అమిర్ ఖాన్ నటించిన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రం ఉంది. వార్ మూవీ ఫైనల్ కలెక్షన్స్ రిపోర్ట్ వచ్చేసరికి ఈ రికార్డు ని అధిగమించే అవకాశం కలదు. యాష్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ మూవీలో హీరోయిన్ గా వాణి కపూర్ నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు