కిడ్నీ వ్యాధి బాధిత గ్రామానికి అల్లు అర్జున్ చిరుసాయం.

కిడ్నీ వ్యాధి బాధిత గ్రామానికి అల్లు అర్జున్ చిరుసాయం.

Published on Oct 3, 2019 9:29 AM IST

Allu arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కిడ్నీ వ్యాధి బాధిత గ్రామమైన కొండలోగం లో స్వచ్ఛ జల వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మందస మండలంలో కల ఈ గ్రామ ప్రజలు కలుషిత నీటి కారణంగా ఏళ్లుగా కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్నారు. దీనికి పరిష్కారంగా స్వచ్ఛ నీటిని సమకూర్చేందుకు అల్లు అర్జున్ ఆర్థిక సాయంతో ఆ గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనితో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేయడంతో పాటు, అల్లు అర్జున్ కి కృతజ్ఞలు తెలిపారు.

ఇక అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అలవైకుంఠపురంలో మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బన్నీకి జంటగా పూజా హెగ్డే నటిస్తుండగా, సీనియర్ హీరోయిన్ టబు, సుశాంత్, నివేదా పేతురాజ్, నవదీప్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంగీతం ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు