‘బాహుబలి 2’లో సేతుపతి గా నటించిన రాకేష్ వర్రే హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎవరికీ చెప్పొద్దు’. బసవ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో రాకేశ్ వర్రే సరసన గార్గేయి యల్లాప్రగడ హీరోయిన్ గా నటిస్తోంది. క్యూట్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి తాజాగా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేస్తూ మొదలైన ట్రైలర్ లో క్యాస్ట్ అనే అంశాన్ని ప్రధానంగా హైలెట్ చేస్తూ ట్రైలర్ ను కట్ చేశారు. మొత్తానికి ట్రైలర్ లో హీరోయిన్ నటనతో పాటు రాకేష్ వర్రే నటన కూడా ఆకట్టుకుంది.
కాగా ట్రైలర్ చూస్తుంటే.. ప్రస్తుత జనరేషన్‌లో ఉన్న క్యాస్ట్ అనే సమస్యను ఎంటర్ టైనింగ్‌గా దర్శకుడు సినిమాలో ప్రస్తావించినట్లు.. మళ్లీ అదే అంశంతో లవ్ స్టోరీలో సమస్యను సృష్టించిన్నట్లు అర్ధమవుతొంది. శంకర్ శర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని క్రేజి అంట్స్ ప్రొడక్షన్ పతాకం ఫై హీరో రాకేష్ వర్రే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక హిట్ చిత్రాల నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన దిల్‌రాజు.. లవ్ స్టోరీని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.


