బీజీ షెడ్యూల్ కారణంగా ‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరుకాలేదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కానీ మెగా కుటుంబంతో ఉన్న విభేదాల వల్లనే బన్నీ వేడుకకు వెళ్లలేదనే పుకార్లు పుట్టుకొచ్చాయి. ఎంతలా అంటే ఈ విషయమై సోషల్ మీడియాలో పెద్ద యుద్దమే జరిగింది. కానీ బన్నీ మాత్రం అవేవీ పట్టించుకోలేదు.
సినిమా విడుదలకు ముందు సినిమా గురించి గొప్పగా మాట్లాడిన ఆయన, సినినా విడుదలయ్యాక బీజీ షేడ్యూల్లో బ్రేక్ తీసుకుని హైదరాబాద్లోని మహేష్ బాబు యొక్క ఏఎంబి సినిమాస్ లో చిరు ఏర్పాటు చేసిన స్పెషల్ షోకు భార్యా పిల్లలతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. దీంతో చిరు, చరణ్ పట్ల ఆయన అభిమానం చెక్కుచెదరినిదని, వారి నడుమ ఎలాంటి విబేధాలు లేవని స్పష్టమైంది.
ఈ స్పెషల్ షోకు అక్కినేని నాగర్జున, అఖిల్, ఇంకా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇకపోతే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండమైన వసూళ్లు సాధిస్తూ విజయం దిశగా దూసుకుపోతోంది.


