‘సైరా’ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటన చూసిన ప్రతి ఒక్కరు ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కేవలం అభిమానులే కాదు సినీ జనం సైతం ఈ వయసులో కూడా సినిమా పట్ల చిరు డెడికేషన్ చూసి ఆశ్చర్యపోతున్నారు. తాజాగా సినిమాను వీక్షించిన సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు చిరుపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇన్ని దశాబ్దాల నుండి చిరు నాకు తెలుసు.. సినిమా పట్ల ఆయన అంకితభావం కొంచెం తగ్గలేదు. నరసింహారెడ్డి పాత్రలో మతిపోగొట్టేలా ఉన్నారు. ఈ వయసులో అయన చేసింది ఒక ఫీట్ అనే అనాలి. సినిమా కోసం సురేందర్ రెడ్డి చాలా కష్టపడ్డారు. తమన్నాను ప్రత్యేకంగా అభినందించాలి. చిత్ర యూనిట్ మొత్తానికి అభినందనలు. ఇది చిరుకి ఆయన కుమారుడు రామ్ చరణ్ ఇచ్చిన గొప్ప కానుక అంటూ కితాబిచ్చారు.
ఎన్నో హిట్ సినిమాల్ని డైరెక్ట్ చేసిన రాఘవేంద్రరావుగారు చిరుతో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి, ఘరానా మొగుడు, కొండవీటి రాజ, అడవి దొంగ’ లాంటి సూపర్ హిట్ సినిమాల్ని చేశారు.


