ఇంటర్వ్యూ : నవీన్ విజయ కృష్ణ- శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నీ వయసెంత అని అడిగితే భయం వేసింది.

ఇంటర్వ్యూ : నవీన్ విజయ కృష్ణ- శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నీ వయసెంత అని అడిగితే భయం వేసింది.

Published on Oct 4, 2019 1:44 PM IST

navven

సీనియర్ హీరో నరేష్ కుమారుడు నవీన్ విజయ కృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం ఊరంతా అనుకుంటున్నారు. శ్రీనివాస్ అవసరాల,మేఘా చౌదరి, సోఫీ సింగ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని రోవాస్కర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దర్శకుడు బాలాజీ సనాల రూపొందించారు. ఊరంతా అనుకుంటున్నారు చిత్రం రేపు విడుదల నేపథ్యంలో హీరో నవీన్ మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.

 

టైటిల్ వైవిధ్యంగా పెట్టినట్టున్నారు?

ఎంతటి మంచి కథా, స్క్రీన్ ప్లే, నిర్మాణ విలువలు ఉన్నప్పటికీ మూవీని ప్రేక్షకుడికి చేరేలా చేసేది టైటిల్. అందుకే అందరికి తెలిసిన, ఊతపదం అయిన ఊరంతా అనుకుంటున్నారు అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఈ టైటిల్ కి మంచి స్పందన రావడంతో పాటు, చాలా మంది బాగుందని చెప్పడం జరిగింది.

 

ఊరంతా అనుకుంటున్నారు మూవీ కథేమిటీ?

రెండు కుటుంబాలు పెద్ద దిక్కుగా గల రామాపురం అనే పల్లెటూరిలో ఒక జంటకు పెళ్ళిచేయాలంటే ఊరిలో అందరూ అంగీకరించాలి. అలాంటి ఊరిలో పుట్టిన అమ్మాయి, అబ్బాయి ఉద్యోగ రీత్యా హైదరాబాద్, చెన్నైలో ఉంటారు. అక్కడ వారిద్దరూ వేరొకరితో ప్రేమలో పడతాడు. కానీ ఊరుమాత్రం వారిద్దరికీ పెళ్లి చేయాలని భావిస్తుంది. ఊరి కట్టుబాట్లకు, వాళ్ళవాళ్ళ ప్రేమకు, ఇష్టాలకు మధ్య సంఘర్షణే మా ఈ చిత్రం.

 

మీరు ఎడిటర్ నుండి హీరోగా మారారు, ఈ రెండింటిలో ఏది కష్టం అనిపించింది?

ఎడిటింగ్ చాలా సులభం అండి. ఎందుకంటే మాగురించి పట్టించుకొనే వారుండరు, ఒక చోట కూర్చొని మన పని మనం చేసుకుంటాం. కానీ హీరోగా ఉండటం చాలా కష్టం. సోషల్ మీడియా ఫోకస్, జనాల ఫోకస్ అంతా నటులపై ఉంటుంది. మనం ఏమి మాట్లాడుతున్నాం, ఏమి ధరిస్తున్నాం, ఎక్కడికి వెళుతున్నాం అని అందరూ గమనిస్తూ ఉంటారు. దానివలన ఆ హీరో ఆటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ మైంటైన్ చేయాలి.

 

శ్రీనివాస్ అవసరాల కూడా నటించారు, ఆయన పాత్ర గురించి చెప్పండి?

ఈ మూవీలో ఆయనకు నాకు మధ్య సన్నివేశాలు చాలా తక్కువ ఉంటాయి. ఒక అమ్మాయి ప్రేమ కోసం ఆరాట పడే అబ్బాయి పాత్ర శ్రీనివాస్ అవసరాల చేయడం జరిగింది.

 

నరేష్ గారి కొడుకై నటుడిగా కాకుండా ఎడిటర్ గా ఎందుకుమారారు?

నాకు 16ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు రానా వాళ్ళ చెందిన యాడ్ కంపెనీలో చేరాను. అక్కడ చిన్న చిన్న యాడ్స్ చేస్తున్నప్పుడు నేను చేసిన కొన్ని ఎడిటింగ్ స్టోరీస్ చూసి మొట్టమొదటిగా దర్శకుడు కృష్ణ వంశి డేంజర్ మూవీకి ఎడిటింగ్ చేశే అవకాశం ఇచ్చారు. దానితో ఎన్టీఆర్ రాఖి, చందమామ చిత్రాలకు కూడా నేను ఎడిటర్ గా పనిచేశాను. కొందరి సలహాతో నటుడిగా మారాలనుకుంటున్నాని నాన్నకు చెవితే ఆయన కష్టం అన్నారు. ఎందుకంటే ఆ టైం లో నేను భారీ కాయంతో ఉన్నాను. నటుడిని కావడం కోసం నేను శ్రమించి బరువుతగ్గాను.

 

కుటుంబ సభ్యుడిగా మహేష్ బాబు సపోర్ట్ ఎలావుందీ?

మహేష్ అన్న నాకు మొదటినుండి సపోర్ట్ ఇస్తున్నారు. అలా అని అంత పెద్ద స్టార్ ని ప్రతి మూవీకి పిలవడం మంచిది కాదు. కానీ మహేష్ మా మూవీ గురించి ట్వీట్ చేశారు అంతకంటే సంతోషం ఏముంటుంది.

 

ఇప్పుడు మీ వయసెంత?

ఇదే ప్రశ్న శ్యాం ప్రసాద్ రెడ్డి గారు అరుంధతి చిత్ర సమయంలో అడిగారు. ఆయన క్లాస్ పీకుతారనుకుంటే నేను కూడా చిన్న వయసులోనే స్వతంత్రం గా తలంబ్రాలు మూవీ నిర్మించాను అని చెప్పి, నాకు ఆత్మ విశ్వాసం సపోర్ట్ ఇచ్చారు.

 

ఎన్నేళ్ల వయసులో కెరీర్ ప్రారంభించారు?

నేను 16ఏళ్లకే రానా వాళ్ళ కంపెనీ లో చేరాను. 19ఏళ్లకే డేంజర్ చిత్రానికి ఎడిటర్ గా పని చేశాను. పాతికేళ్ల లోపే రాఖీ,చందమామ, అరుంధతి చిత్రాలకు పనిచేయడం జరిగింది. 32ఏళ్లకు హీరో అయ్యాను.

 

మీ నాన్నగారితో మీకున్న అనుబంధం గురించి చెప్పండి?

మా ఇద్దరి మధ్య అనుబంధం చాలా లిమిటెడ్. కెరీర్ కి సంబంధించిన చాలా కొద్దివిషయాలే ఆయనతో పంచుకుంటాను. ప్రతి విషయంలో ఆయన సపోర్ట్ తీసుకోవడం నచ్చదు. ఐతే అప్పుడప్పుడు కొన్ని విలువైన సలహాలు ఇస్తారు.

 

టాలీవుడ్ లో మీరు రిచ్చెస్ట్ హీరో అంటున్నారు?

మీరు చెప్పేది నిజమైతే నేను కూడా హ్యాపీ. నేను రిచ్చెస్ట్ హీరో అయితే ప్రెస్ మీట్ ఫలక్ నుమా ప్యాలెస్ లో పెట్టేవాడిని( నవ్వుతూ).

 

దర్శకత్వం చేసే అవకాశం ఏమైనా ఉందా?
ఖచ్చితంగా అండి…! ఎందుకంటే నాకు అంత్యంత ఇష్టమైన పని దర్శకత్వం వహించడం. భవిష్యత్ లో ఖచ్చితంగా చేసే అవకాశం ఉంటుంది.

 

మళ్ళీ ఎడిటింగ్ వైపు వెళతారా లేక హీరోగానే కొనసాగుతారా?

లేదండి ఇక ఎడిటింగ్ చేయను. కాకపోతే ఆ వ్యాపకం, అలవాటు పోదు కాబట్టి నా మొబైల్ తో ఏమైనా చిన్న చిన్న వీడియోలు ఎడిటింగ్ చేస్తాను. అంతే కానీ పూర్తి స్థాయి ఎడిటింగ్ వైపు వెళ్ళేది లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు