తమిళ ఇండస్ట్రీలో రజినీకాంత్ తరువాత ఆ స్థాయిలో స్టార్ డమ్ ఉన్న స్టార్ హీరో ‘విజయ్’. అలాంటి స్టార్ హీరో గురించి సక్సెస్ లేని ఓ డైరెక్టర్ దారుణమైన కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. సామి అనే తమిళ దర్శకుడు విజయ్ గురించి మాట్లాడుతూ.. తన ఫ్యాన్స్ విషయంలో విజయ్ చాల దారుణంగా ప్రవర్తిస్తుంటారని, పైకి కనిపించినట్లుగా అందరూ అనుకున్నంత సౌమ్యుడు కాదని.. తన ఫ్యాన్స్ పై విజయ్ చూపించే ప్రేమంతా నాటకం అని దర్శకుడు సామి సంచలన కామెంట్స్ చేశారు.
ఇంకా ఈ దర్శకుడు మాట్లాడుతూ.. ‘తన ఫ్యాన్స్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన తరువాత విజయ్ చేతులను డెటాల్ తో శుభ్రం చేసుకుటాడని, ఒక విధంగా విజయ్ కి తన ఫ్యాన్స్ అంతా నీచంగా కనిపిస్తుంటారని అందుకే ఆయన వాళ్ళతో అలా ప్రవర్తిస్తాడని.. అలాగే బయట ఈవెంట్స్ లో తనకు సంబంధం లేని అనవసరమైన టాపిక్స్ గురించి కూడా ఎక్కువుగా మాట్లాడతారని, అలాంటివి విజయ్ తగ్గించుకోవాలని సామి కామెంట్స్ చేశారు. తన సినిమాలతో వరుసగా కొత్త రికార్డులను సృష్టించే స్టార్ హీరో పై ఎందుకు ఈ దర్శకుడు ఇలాంటి కామెంట్స్ చేసాడో తెలియాల్సి ఉంది. అయితే ఈ కామెంట్స్ పై విజయ్ ఇంకా స్పందించలేదు.
విజయ్ పై కామెంట్స్ చేసిన వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


