టాలీవుడ్ గత రెండు నెలలో రెండు భారీ బడ్జెట్ చిత్రాలను విడుదల చేసింది, వాటిలో ఒకటి సాహో కాగా మరొకటి సైరా నరసింహారెడ్డి. ఆగస్టు 30న ప్రభాస్ నటించిన సాహో విడుదల కాగా, ఈనెల 2న మెగాస్టార్ నటించిన మరో భారీ బడ్జెట్ మూవీ సైరా విడుదలైంది. ఈ రెండు చిత్రాల బడ్జెట్ ఆరువందల కోట్లు కావడం గమనార్హం. ఇంత భారీ బడ్జెట్ మరియు స్టార్ హీరోల సందడి చూసిన టాలీవుడ్ మరో రెండు నెలల వరకు చిన్న సినిమాలతో సరిపెట్టుకోవలసిందే. ఎందుకంటే డిసెంబర్ వరకు టాలీవుడ్ నుండి ఒక్క పెద్ద హీరో మూవీ విడుదల కూడా లేదు.
మిగిలిన అక్టోబర్ నెలతో పాటు రానున్న నవంబర్ నెలలో కూడా కేవలం చిన్న చిత్రాలు మాత్రమే విడుదల అవుతున్నాయి. రాగాల 24గంటల్లో, సాఫ్ట్ వేర్ సుధీర్, మీకు మాత్రమే చెప్తా, ఇద్దరిలోకం ఒకటే, రాహు, ఆవిరి, రాజు గారి గది3, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఇలా మొత్తం డజనుకు పైగా చిత్రాలు విడుదలకు క్యూలో ఉన్నాయి. రవితేజ నటించిన డిస్కో రాజా, బాలయ్య మూవీ డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి అప్పటివరకు బాక్సాపీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి. ఇక బాలయ్య మూవీ విడుదలైన కొద్దిరోజులకే మహేష్, బన్నీ, కళ్యాణ్ రామ్ సంక్రాంతి సినిమాలతో వచ్చేస్తారు.


