సిక్స్ ప్యాక్ కోసం సూపర్ హీరో పడ్డకష్టం చూడలేమబ్బా.

సిక్స్ ప్యాక్ కోసం సూపర్ హీరో పడ్డకష్టం చూడలేమబ్బా.

Published on Oct 11, 2019 11:00 PM IST

hrithik roshan

బాలీవుడ్ లో ప్రయోగాలు చేసే స్టార్ హీరోలలో హృతిక్ రోషన్ ఒకరు. క్రిష్ గా సూపర్ హీరో పాత్రలు చేసిన హృతిక్ కాబిల్,సూపర్ 30 వంటి చిత్రాలలో సాధారణ పౌరుడి పాత్రలు చేసి అలరించారు. కాగా ఆయన తాజా చిత్రంలో సిక్స్ ప్యాక్ కర్వుడ్ బాడీలో కనిపించి అలరించాడు. గ్రీక్ గాడ్ బాడీ అనిపేరున్న హృతిక్ రోషన్ సూపర్ 30 మూవీలోని ఆనంద్ కుమార్ పాత్ర కోసం బెల్లీ తో కూడిన ఫ్యాట్ బాడీ రెడీ చేశారు. ఐతే సూపర్ థర్టీ మూవీ తరువాత వార్ చిత్రం కోసం మళ్ళీ ఆయన సిక్స్ ప్యాక్ బాడీ చేయాల్సి రావడంతో నిపుణుల సమక్షంలో కఠిన కసరత్తులు చేశారు.జిమ్ లో తాను పడ్డ శారీరక శ్రమను తెలియాజేసే ఒక వీడియో హృతిక్ షేర్ చేశారు.

యూట్యూబ్ లో విడుదలైన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మాధ్యమాలలో వైరల్ గా మారింది. హ్రితిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన వార్ మూవీ వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ 200కోట్ల వసూళ్లను దాటివేయడం గమనార్హం. దర్శకుడు సిద్దార్ధ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ మూవీలో వాణి కపూర్ హీరోయిన్ గా నటించింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు