‘ఛలో’ సినిమాతో టాలీవూడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ రష్మిక మండన్నా. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి.. రెండవ చిత్రం ‘గీతగోవిందం’తో ఏకంగా స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంది ఈ యంగ్ బ్యూటీ. ప్రస్తుతం స్టార్ హీరోలు మహేష్ బాబు, బన్నీలాంటి సూపర్ స్టార్స్ సినిమాల్లో నటుస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇంత త్వరగా స్టార్ హీరోయిన్ అయిపోయిందని మిగిలిన హీరోయిన్స్ కూడా రష్మిక ను చూసి అసూయ పడుతున్నారు. అందుకు నిదర్శనం రష్మిక పై కన్నడ హీరోయిన్ హరిప్రియ చేసిన కామెంట్లే సాక్ష్యం. ఆమె తాజాగా నటించిన ఓ కన్నడ సినిమాలో ముద్దు సీన్ ఉంది.
కాగా ఆ సీన్ గురించి మాట్లాడుతూ.. నేను కూడా కొన్ని రొమాంటిక్ సీన్స్ లో నటించాను. కానీ, వాటిలో లిప్‌లాక్ సీన్ లేదు. ముఖ్యంగా గీతగోవిందం సినిమాలో రష్మిక – విజయ్ మధ్య చిత్రీకరించిన లిప్‌లాక్ సీన్ లాంటి సీన్స్ లో నేను నటించను. కుటుంబమంతా కలిసి చూసేవిధంగా ఉండే సినిమాలనే నేను ఎంచుకుంటా. అది నా బాధ్యత అని హరిప్రియ చెప్పుకొచ్చింది. మొత్తానికి హరిప్రియ మాటలు వింటుంటే రష్మిక లిప్ లాక్ గురించి కావాలని కామెంట్లు చేసినట్లు అనిపిస్తోంది.


