స్టార్ హీరో మూవీ ట్రైలర్ పై అంచనాలు ఆకాశంలో

స్టార్ హీరో మూవీ ట్రైలర్ పై అంచనాలు ఆకాశంలో

Published on Oct 12, 2019 12:29 PM IST

Bigil1

తలపతి విజయ్ ట్రైలర్ విడుదల డేట్ ప్రకటించినప్పటినుండి విజయ్ అభిమానులే కాకుండా, సినీ ప్రేమికులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంత ఆసక్తి కలగడానికి దర్శకుడు అట్లీ కావడంతో పాటు, విజయ్ ఈ మూవీలో భిన్న గెటప్స్ లో కనిపించడమే. లేడీ ఫుట్ బాల్ జట్టు కోచ్ పాత్ర అలాగే మరో అవుట్ అండ్ మాస్ రోల్ ఆయన చేస్తున్నారు. ఇక నేడు ఈ మూవీ ట్రైలర్ విడుదుల కానుంది.

ఈరోజు సాయంత్రం 6గంటలకు బిగిల్ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. ఈ మధ్య కాలంలో ఏ తమిళ చిత్ర ట్రైలర్ కొరకు ఇంతగా ఎదురుచూడలేదంటే అతిశయోక్తికాదు. రెండున్నర నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్ ఫ్యాన్స్ ని ఉపేయడం ఖాయం అంటున్నారు. ఇక ఈ మూవీ తెలుగులో విజిల్ పేరుతో రానుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న బిగిల్ వచ్చేనెలలో దీపావళి కానుకగా విడుదల కానుంది. నయనతార విజయ్ కి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి, సంగీతం ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు