విడుదలై రెండువారాలవుతున్న సైరా దూకుడు తగ్గలేదు.

విడుదలై రెండువారాలవుతున్న సైరా దూకుడు తగ్గలేదు.

Published on Oct 12, 2019 2:56 PM IST

syeraa4

సైరా విడుదలై దాదాపు రెండు వారాలు కావస్తుంది. ఈనెల 2న గాంధీ జయంతి కానుకగా విడుదలైన సైరా ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. దసరా సెలవులలో మెరుగైన వసూళ్లు అందుకున్న ఈ చిత్రం సెలవుల అనంతరం కూడా చెప్పుకోదగ్గ కలెక్షన్స్ సాధించడం గమనార్హం. నిన్న శుక్రవారం కూడా సైరా తెలుగురాష్ట్రాలలో 2.10 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు రాబట్టడం ఇందుకు నిదర్శనం. ఇప్పటికే దాదాపు 92కోట్ల షేర్ వసూళ్లు సాధించిన సైరా వచ్చే శని, ఆదివారాలలో 100కోట్ల మ్యాజిక్ ఫిగర్ ని చేరే అవకాశం కనబడుతుంది.

ఇక ఉత్తరాంధ్ర నైజాం ఏరియాలలో సైరా లాభాలు పంచే దిశగా సాగుతుంది. సుదీర్ఘ విరామం తరువాత 150 ఖైదీ చిత్రంతో 100కోట్లు సాధించిన చిరు సైరా చిత్రంతో మరోమారు ఆ ఫీట్ ని సాధించనున్నారు. ఇక చిరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే స్వాంతంత్ర్య సమరయోధుడి పాత్ర చేయగా, నయనతార, తమన్నా ఆయన సరసన నటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హీరో రామ్ చరణ్ నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు