చిరు 153వ సినిమాను డైరెక్ట్ చేయబోయేది అతడేనా ?

చిరు 153వ సినిమాను డైరెక్ట్ చేయబోయేది అతడేనా ?

Published on Oct 13, 2019 7:53 PM IST

chiranjeevi sukumar

చిరంజీవిని డైరెక్ట్ చేయాలని ప్రతి దర్శకుడికి ఉంటుంది. కానీ ఆ అవకాశం కొంతమందికే దక్కుతుంటుంది. ఇటీవల ఆ అవకాశాన్ని ‘సైరా’తో సురేందర్ రెడ్డి దక్కించుకుని సద్వినియోగం చేసుకున్నాడు. సురేందర్ రెడ్డికి ఇంత పెద్ద సినిమా ఇవ్వడం వెనుక కీ రోల్ ప్లే చేసింది రామ్ చరణే. తనకు ‘ధృవ’తో విజయాన్నిచ్చిన సురేందర్ రెడ్డిని చరణ్ ఎంతగానో నమ్మి ఈ ప్రాజెక్ట్ అప్పజెప్పాడు.

ఇక వరుసగా హిట్లు కొడుతూ వస్తున్న కొరటాల శివపై చిరుకి మొదటి నుండి గట్టి నమ్మకముంది. అందుకే తన 152వ సినిమా అవకాశాన్ని అతనికే ఇచ్చాడు. ఇక తాజాగా చరణ్ మలయాళ హిట్ చిత్రం ‘లూసిఫర్’ రీమేక్ హక్కుల్ని కొన్నాడు. ఈ పొలిటికల్ డ్రామా కోసం కూడా చరణ్, చిరులు ఇకర్ని ఎంపిక చేసుకున్నారట. అతనే సుకుమార్.

ఈ లెక్కల మాస్టారు రామ్ చరణ్ కు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్, రూ.100 కోట్ల షేర్ రికార్డ్ నెలకొల్పిన ‘రంగస్థలం’ను అందించాడు. చిరు సైతం సుకుమార్ పనితనానికి ఫిదా అయ్యారు. అందుకే 153వ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఆయనకేనాని ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి ఈ వార్తలపై మెగా కాంపౌండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు