హారర్ సినిమాతో ‘హన్సిక’ హిట్ కొడుతుందా ?

హారర్ సినిమాతో ‘హన్సిక’ హిట్ కొడుతుందా ?

Published on Oct 13, 2019 8:05 AM IST

Hansika

తమిళంతో పాటు తెలుగులో కూడా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తోంది హన్సిక. ప్రస్తుతం తెలుగులో ‘తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్’ చేస్తున్న ఆమె తమిళంలో మూడు ప్రాజెక్ట్స్ చేస్తోంది. హర్రర్ జానర్ సినిమాల్ని ఎక్కువగా ఇష్టపడే హన్సిక అలాంటి ప్రాజెక్ట్ ఒకదానికి సైన్ చేసింది. ఇందులో మాజీ క్రికెటర్ శ్రీశాంత్ నటిస్తున్నాడు. అయితే ప్రతినాయకుడి పాత్రలో శ్రీశాంత్ నటిస్తుండటం విశేషం. మరి శ్రీశాంత్ విలన్ గా సక్సెస్ అవుతాడా ? ఇంతకీ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న హన్సిక హారర్ సినిమాతో హిట్ కొడుతుందా ? చూడాలి.

హరి శంకర్, హరీశ్ నారాయణ్ అనే ఇద్దరు దర్శకులు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. వీరు గతంలో ‘అంబులి’ అనే తమిళ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇకపోతే ఈ చిత్రాన్ని రంగనాథన్ నిర్మించనున్నాడు. ఇది కేవలం హర్రర్ సినిమా మాత్రమే కాదని, ఇందులో కామెడీ కూడా ఉంటుందని టీమ్ చెబుతున్నారు. ఇకపోతే శ్రీశాంత్ గతంలో ‘టీమ్ 5’ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు