‘రొమాంటిక్’లో రమ్యకృష్ణ రోల్ అదే !

‘రొమాంటిక్’లో రమ్యకృష్ణ రోల్ అదే !

Published on Oct 16, 2019 9:00 PM IST

Ramya Krishna

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న తాజా సినిమా ‘రొమాంటిక్’. కాగా నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం రమ్యకృష్ణ ఆకాష్ పూరి తల్లి పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ఆకాశ్ పూరి సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ బాగా వైరల్ ఆయిన సంగతి తెలిసిందే. హీరోయిన్ కేతిక టాప్ లెస్ గా హీరోని కౌగిలించుకోవడం.. ఘాడమైన ప్రేమలో ప్రపంచాన్ని మర్చిపోయిన ప్రేమ జంటగా వీరిద్దరూ కనిపించడంతో పోస్టర్ యూత్ ను బాగా ఆకట్టుకుంది.

కాగా ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుందట. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు