తెలుగు తమిళ భాషలలో భారీగా దీపావళి కానుకగా విడుదల కానున్న బిగిల్ మూవీ సెన్సార్ కార్యక్రమాలు నిన్న పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు బిగిల్ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఐతే సెన్సార్ సర్టిఫికెట్ లో బిగిల్ మూవీ రన్ టైం చూసిన అందరూ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక నిమిషం తక్కువ మూడు గంటలు నిడిగివి కావడమే ఇందుకు కారణం. ఐతే బిగిల్ మూవీ అంత నిడివి వెనుక అసలు కారణం నేడు బయటికొచ్చిది.
చిత్రంలో క్లైమాక్స్ తరువాత ఏడు నిముషాలు మేకింగ్ వీడియోతో కూడిన ఎండ్ క్రెడిట్స్ రోల్ అవుతాయట. కాబట్టి బిగిల్ మూవీ అసలు డ్యూరేషన్ కేవలం 2గంటల 52 నిముషాలు మాత్రమే. గతంలో విజయ్ నటించిన మెర్సల్, తుపాకీ చిత్రాల నిడివి కూడా ఇంతే కావడం గమనార్హం. ఇక యంగ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ మూవీలో హీరోయిన్ గా నయనతార నటిస్తుండగా, ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు.


