సీనియర్ కమెడియన్ అలీ మూవీ రివ్యూ లు రాసే మాధ్యమాలపై మండిపడ్డారు. పరుష పదజాలంతో అసహనం వ్యక్తం చేశారు. ప్రేక్షకులే మా కామెడీని ఆస్వాదిస్తూ పడిపడి నవ్వుతుంటే, క్రిటిక్స్ మూవీని తక్కువ చేసి మాట్లాడం తగదన్నారు. రాజుగారి గది 3 సక్సెస్ మీట్ లో అలీ ఈ విధంగా స్పందించారు. సినిమా వసూళ్లను దెబ్బతీసే ఇలాంటి రివ్యూస్ ప్రమాదం అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజుగారి గది 3 చిత్రంలో అలీ కీలకపాత్ర చేయడం జరిగింది.
అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు ఓంకార్ డైరెక్ట్ చేయడంతో పాటు స్వయంగా నిర్మించారు. గతంలో వచ్చిన రాజుగారి గది సిరీస్ లో మూడవ భాగంగా రాజుగారి గది 3 చిత్రం రావడం జరిగింది. హారర్ కామెడీ మూవీగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన అందుకుంది. ఈనెల 18న విడుదలైన ఈ చిత్రం మూడురోజులకు గానూ రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 3.5 కోట్ల షేర్ రాబట్టినట్టు సమాచారం.


