దర్శకుడు తరుణ్ భాస్కర్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకం పై నిర్మిస్తోన్న తొలి చిత్రం.. ‘మీకు మాత్రమే చెప్తా’. కాగా తాజాగా ఈ సినిమా నుండి ‘రావోయ్.. రావోయ్ కథ చెప్తా.. మీకు మాత్రమే చెప్తా’ అనే సాంగ్ రిలీజ్ చేసింది చిత్రబృందం. అయితే ఈ పాటలో విజయ్ దేవరకొండ కనిపించడం విశేషం. సినిమాలోనే కీలకమైన సందర్భంలో వచ్చే ఈ సాంగ్ ను విజయ్ దేవరకొండ మీదే చిత్రీకరించారు. మంచి ట్యూన్ తో వచ్చిన ఈ సాంగ్ లో విజయ్ డ్రెసింగ్ దగ్గర్నుంచీ లిరిక్స్ స్టెప్స్ మరియు నేపథ్యం వరకూ చాల బాగున్నాయి. సాంగ్ చివర్లో మెయిన్ కథకు లింగ్ చేయడం కూడా బాగుంది.
మొత్తానికి విజయ్ ఈ సాంగ్ తో తన అభిరుచిని పరిచయం చేశాడు. పెళ్లి చూపులతో యూత్ లో బలమైన ముద్ర ను వేసుకున్న విజయ్ కి ఆ ప్రయాణంలో పడిన కష్టాలు తెలుసు. అందుకే కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసేందుకు ఈ సినిమా చేస్తున్నాడట. ఇందులో అనసూయ భరద్వాజ్, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుదు షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరి దేవరకొండ మొదటి వెంచర్ తో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.
సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


