పూరి-రామ్ ల ఇస్మార్ట్ హిట్ కి వందల రోజులు

పూరి-రామ్ ల ఇస్మార్ట్ హిట్ కి వందల రోజులు

Published on Oct 25, 2019 2:06 AM IST

ismart

డైనమిక్ డైరెక్టర్, ఎనర్జిటిక్ హీరో కలిసి సినిమా చేస్తే ఏరేంజ్ లో పేలుతుందో ఇస్మార్ట్ శంకర్ మూవీ చూపించింది. ఈ మూవీ చూసిన తరువాత ఇంత కాలం పూరి రామ్ తో ఎందుకు మూవీ చేయలేదనిపించింది. కేర్ లెస్ ఊరమాస్ తెలంగాణా పోరగాడిగా రామ్ నటన, పూరి టేకింగ్ మాస్ ప్రేక్షకులను కట్టి పడేసింది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం కూడా ఈ మూవీ విజయంలో కీలక పాత్ర పోషించింది.

వరల్డ్ వైడ్ గా 75కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం రేపటికి 100రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఛార్మి, పూరి మరియు మిగతా యూనిట్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఇస్మార్ట్ శంకర్ మూవీలో తమకు నచ్చిన పాట లేదా సన్నివేశం పంచుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ కి జంటగా నిధి అగర్వాల్, నభా నటేష్ నటించడం జరిగింది.

తాజా వార్తలు