టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక శైలి. మంచి సినిమా ఏ పొరుగు పరిశ్రమలో తెరకెక్కినా హీరోగా ఆ చిత్రాన్ని రీమేక్ చేసి తెలుగు ప్రేక్షకులకు అందించడానికి ముందుంటారు. వెంకటేష్ కెరీర్ ప్రారంభం నుండి అనేక ఇతర భాషా చిత్రాల రీమేక్ లో నటించారు. ఆయన మరో తమిళ చిత్ర రీమేక్ కి సిద్ధమయ్యారు. ధనుష్ హీరోగా వెట్రి మారన్ దర్శకత్వంలో ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన అసురన్ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ తో చేస్తున్నట్లు నిర్మాతలు నిన్న అధికారికంగా ప్రకటించారు.
కలైపులి పులి థాను, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఐతే అజయ్ దేవగణ్ హిందీ చిత్రం దే దే ప్యార్ దే చిత్రాన్ని వెంకటేష్ తెలుగులో రీమేక్ చేస్తారు అని గతంలో వార్తలు వచ్చాయి. యువతి ప్రేమలో పడిన విడాకులైన మిడిల్ ఏజ్ మెన్ గా రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఆ మూవీగా అక్కడ మంచి హిట్ అందుకుంది. మరి అలాంటి అమ్మాయిల గ్లామర్, హిలేరియస్ కామెడీతో సాగే చిత్రం కాదని వెంకటేష్, డి గ్లామర్ రోల్ మరియు కాన్సెప్ట్ బేస్డ్ మూవీని ఎంచుకుని ఆశ్చర్య పరిచాడు.
దే దే ప్యార్ దే కమర్షియల్ మూవీ కాగా, అసురన్ కాన్సెప్ట్ ఓరియెంట్ చిత్రం. చిత్రం ఆద్యంతం సీరియస్ ఎమోషనల్ నోట్ లో నడుస్తుంది. ఇద్దరు హీరోయిన్ల తో వెంకీ కామెడీ చేస్తాడనుకుంటే, అసురన్ తో ఏడిపించదానికి రెడీ అవుతున్నాడు.


