చాలా రోజులు తరువాత కార్తీ గట్తిగానే కొట్టాడే

చాలా రోజులు తరువాత కార్తీ గట్తిగానే కొట్టాడే

Published on Oct 26, 2019 7:05 PM IST

Karthi2

హీరో కార్తి కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకం పై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖైదీ’. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్‌ సమర్పిస్తున్నారు. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఒక రాత్రి లో నాలుగు గంటలు జరిగిన ఒక ఛేజింగ్ ఎపిసోడ్ గా తెరకెక్కించిన దర్శకుడు ఎక్కడా పట్టు కోల్పోకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నాడు.

ఉత్కంఠ గా సాగే యాక్షన్ క్రైమ్ ఎపిసోడ్ కి కూతురు సెంటిమెంట్ జోడించి తీయడం చిత్రానికి హైలెట్ గా నిలిచింది. యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఆవారా వంటి చిత్రాలతో తెలుగులో కూడా మార్కెట్ ఏర్పరుచుకున్న కార్తీ ఈ మధ్య కాలంలో తన స్థాయి హిట్ అందుకుంది లేదు. ఖైదీ చిత్రంతో మరో కార్తీ గట్టిగానే కొట్టారు అంటున్నారు. ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా రా అండ్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఖైదీ కమర్షియల్ గా విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

తాజా వార్తలు