అతను సేఫ్…,ఇక ఆనలుగురిలో ఒకరు అవుట్

అతను సేఫ్…,ఇక ఆనలుగురిలో ఒకరు అవుట్

Published on Oct 26, 2019 11:14 PM IST

bigboos3

అనూహ్య మలుపులు, హీటెక్కించే వాగ్వాదాలు, చెమటపట్టించే టాస్క్ ల మధ్య బిగ్ బాస్ షో చివరి ఎపిసోడ్స్ ఉత్కంఠగా సాగుతున్నాయి. ఎలాగైనా ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోవాలని కంటెస్టెంట్స్ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. కాగా అనూహ్యంగా ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్న ఐదుగురి నుండి బాబా భాస్కర్ సేవ్ ఐయ్యాడు. అతడు ఫైనల్ కి అర్హత సంపాదించి టైటిల్ బరిలో నేనూ ఉన్నాను అని మిగతా సభ్యులకు సంకేతాలు పంపారు.

బిగ్ బాస్ అందరిని గార్డెన్ లోకి పిలిచి బిగ్ బాస్ లో తమ జర్నీ ఎలా సాగింది అన్న విషయంపై ఏమీ దాచకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పామన్నారు. దాంతో ఇంట్లో ఎలా ఉన్నాం..బయట ఎలా ఉన్నాం..ఇంట్లో ఏం నేర్చుకున్నాం అన్న విషయంపై అందరూ మనసు విప్పి చెప్పారు. ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఒక్కొక్కరిపై గ్రీన్ లైట్, రెడ్ లైట్ వేస్తూ ఆర్పుతూ ఫైనల్ గా బాబా భాస్కర్ ఈ వారం ప్రేక్షకులు వేసిన ఓట్లతో బాబా సేవ్ అయినట్లు బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. దీనితో బాబా భాస్కర్ టాప్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్ లో చేరిపోయారు.

తనపై నమ్మకం ఉంచి అభిమానంతో ఓట్లేసి గెలిపించిన ప్రేక్షకులకు బాబా భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు. సో…, ఇక ఉన్న నలుగురు సభ్యులైన వరుణ్, శివజ్యోతి, శ్రీముఖి, అలీ రెజా లలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఎలిమినేట్ కాగా మిగిలిన ముగ్గురు టాప్ ఫైవ్ లో చోటు సంపాదించుకోవడంతో పాటు, ఫైనల్ కి అర్హత సంపాదిస్తారు.

తాజా వార్తలు