తలపతి విజయ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘విజిల్’. మంచి ఎమోషన్ తో పాటు బి, సి సెంటర్ల ప్రేక్షకులకు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉండటంతో సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది. ముఖ్యంగా నైజాం బాక్స్ ఆఫీస్ వద్ద విజిల్ బాగానే మోత మోగిస్తోంది. కాగా నైజాంలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే 64 లక్షలను, సెకెండ్ డే 58 లక్షలను, థర్డ్ డే 60 లక్షలను, ఫోర్త్ డే 30 లక్షలను సాధించింది.
కాగా మొత్తం నాలుగు రోజుల థియేట్రికల్ రన్ లో విజిల్ ఏపి మరియు తెలంగాణలో 7.7 కోట్ల షేర్ ను సాధించింది. అయితే ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ .10 కోట్లకు అమ్ముడయ్యాయి. బ్రేక్ ఈవెన్ మార్క్ ను చేరుకోవడానికి ఇంకా రూ .2.25 కోట్లు సాధించాల్సి ఉంది. ఈ వారంలో సాధించే కలెక్షన్స్ తో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది.
ఇక విజయ్ అట్లీ కాంబినేషన్‌లో విడుదలైన తెరి(పోలీస్), మెర్సల్(అదిరింది) చిత్రాలు బ్లాక్ బస్టర్ చిత్రాలుగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీరి కలయికలో హ్యాట్రిక్ చిత్రంగా విజిల్ నిలిచింది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఏజీయస్ ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకం పై కల్పాతి అఘోరామ్ నిర్మించారు.


