‘రూలర్’లో ఎంటర్ టైన్మెంట్ కూడా ఉందట !

‘రూలర్’లో ఎంటర్ టైన్మెంట్ కూడా ఉందట !

Published on Oct 29, 2019 8:00 AM IST

bala1

కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రం ‘రూలర్’ శరవేగంగా తెరకెక్కుతూ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతొంది. కాగా ఈ సినిమాలో మంచి కామెడీ కూడా ఉంటుందట. ముఖ్యంగా సిట్యుయేషనల్ కామెడీ బాగా వచ్చిందని.. ఖచ్చితంగా ఈ సినిమా యాక్షన్ తో పాటు కామెడీతోనూ ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో చాలా మంది ప్రముఖ హాస్యనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలయ్య పక్కన నటించే నటుల నుండి దర్శకుడు మంచి కామెడీని రాబట్టుకున్నాడట.

ఇక `జైసింహా` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌ర్వాత కె.ఎస్‌.రవికుమార్‌ – బాలయ్య హిట్ కాంబినేష‌న్‌ లో రూపొందుతోన్న ఈ సినిమాలో బాల‌కృష్ణ రెండు డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌న‌ప‌డతారు. ఈ సినిమాలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌ పై సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు