బిగ్ బాస్ చివరి దశకు చేరుకుంది.ఇంకా కేవలం రెండు రోజులలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది.శ్రీముఖి, రాహుల్, వరుణ్, బాబా భాస్కర్ టాప్ 5 కంటెస్టెంట్స్ గా నిలిచారు. వీరికి సపోర్ట్ చేస్తూ కొంతమంది సెలబ్రిటీలు సైతం ప్రచారం బాట పట్టారు. శ్రీముఖికి సపోర్ట్ గా జబర్దస్త్ యాంకర్ రష్మీ ప్రచారం మొదలుపెట్టారు. రాహుల్‌కు పాప్ సింగర్ నోయెల్ ప్రచారం చేస్తున్నాడు. అలీ రెజాకు ఓటు వేయాలని పటాస్ యాంకర్ రవి చెప్పడం జరిగింది.
కాగా గత సీజన్ లో రన్నర్ గా నిలిచినా సింగర్ గీతా మాధురి కూడా హౌస్ లోని ఇద్దరికి మద్దతు ప్రకటించారు. . హౌస్‌లో టాప్ 5కు చేరుకున్న ఇంటి సభ్యులందరికీ గీతా మాధురి ఆల్ ద బెస్ట్ తెలిపింది. అయితే శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్‌లతో దిగిన ఫొటోను మాత్రమే పంచుకుంది. అంటే గీతామాధురికి వాళ్లిద్దరిలో ఎవరు టైటిల్ గెలిచినా ఓకే అన్నట్లుగా హింట్ ఇచ్చారు.దీనితో గీత మాధురి అభిమానులు కూడా రెండుగా విడిపోయి శ్రీముఖి, వరుణ్ లలో వారికి నచ్చిన ఓటు వేస్తున్నారని సమాచారం.


