రజిని నెక్స్ట్ మూవీ టైటిల్ అదేనా…?

రజిని నెక్స్ట్ మూవీ టైటిల్ అదేనా…?

Published on Nov 1, 2019 10:00 PM IST

Rajinikanth1

సూపర్ స్టార్ రజిని కాంత్ గత రెండేళ్లుగా సినిమాల విషయంలో వేగం పెంచారు. ఆయన యంగ్ హీరోలతో పోటీపడుతూ వరుస బెట్టి సినిమాలు చేస్తున్నారు.ప్రస్తుతం ఏ ఆర్ మురుగదాస్ దర్శకుడిగా దర్బార్ మూవీ చేస్తున్న రజిని, మాస్ చిత్రాల దర్శకుడు శివ తో మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే సెట్స్ పైకెళ్ళనున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. కాగా ఈ చిత్ర టైటిల్ పై ఒక వార్త కోలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.

హీరో అజిత్ తో వీరం, వివేకం, విశ్వాసం వంటి టైటిల్స్ తో వరుస విజయాలు అందుకున్న దర్శకుడు శివ అదే సెంటిమెంట్ ను రజిని విషయంలో కూడా ఫాలో అవ్వాలని చూస్తున్నాడట. అందుకే ఈ చిత్రానికి ‘వియోగం’ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారని సమాచారం. దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ ప్రముఖంగా వినిపిస్తున్న వార్త. ఇక రజిని నటించిన దర్బార్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు