మీకు మాత్రమే చెప్తా రిసల్ట్ పై దేవరకొండ రియాక్షన్

మీకు మాత్రమే చెప్తా రిసల్ట్ పై దేవరకొండ రియాక్షన్

Published on Nov 3, 2019 12:00 AM IST

Vijay Devarakonda

విజయ్ దేవరకొండ నిర్మాతగా కింగ్ అఫ్ ది హిల్స్ అనే బ్యానర్ స్థాపించి మొదటి చిత్రంగా తన మిత్రుడైన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ను హీరోగా చేసి తీసిన చిత్రం మీకు మాత్రమే చెప్తా. కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నిన్న విడుదలై డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. మొబైల్ వలనవ్యక్తిగత విషయాలు ఎంత ఈజీగా బయట ప్రపంచానికి తెలిసిపోతాయో, దానివలన ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సివస్తుందో అన్న చిన్న పాయింట్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఓ తరగతి ఆడియన్స్ కి మంచి అనుభూతినే పంచుతుంది.

కాగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా ముఖంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాత విజయ్ దేవరకొండ మాట్లాడుతూ మీకు మాత్రమే చెప్తా చిత్రానికి వస్తున్న స్పందన అద్భుతం అన్నారు. రేపటి నుండి దర్శకుడు, సంగీత దర్శకుడు ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరి పేరు వికీ పీడియాలో మీకుమాత్రమే చెప్తా తో పాటు చూపిస్తుంది అన్నారు. చిత్ర యూనిట్ పడ్డ కష్టానికి మంచి ఫలితం ఇచ్చారు అన్నారు. ముఖ్యంగా మల్టీ ఫ్లెక్సులలో మంచి ఆదరణ దక్కించుకుంటుంది అని చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు