కండలు పెంచుతున్న కుర్ర హీరో

కండలు పెంచుతున్న కుర్ర హీరో

Published on Nov 3, 2019 10:41 AM IST

naga

యంగ్ హీరో నాగ శౌర్య ‘ఛలో’ చిత్రం తరువాత ఆ స్థాయి విజయం అందుకోలేదు. ఈ ఏడాది ఆయన నటించిన ‘ఓ బేబీ’ సూపర్ హిట్ సాధించినా ఆ విజయం సోలోగా సమంత ఖాతాలోకి వెళ్ళిపోయింది. కాగా నాగ శౌర్య సొంత నిర్మాణ సంస్థ అయిన ఐరా క్రియేషన్స్ లో ‘అశ్వద్ధామ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నిర్మాణంత కార్యక్రమాలు జరుపుకుంటుంది. నూతన దర్శకుడు రమణ తేజ తెరకెక్కించగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు.

అశ్వద్ధామ చిత్రంలో నాగ శౌర్య సరసన మెహ్రీన్ నటిస్తుంది. కాగా ఈ హీరో లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 8గా వస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలైనట్లు సమాచారం. ఐతే ఈ చిత్రం కోసం నాగ శౌర్య కండలు పెంచుతున్నాడు. ఈ మూవీలో పాత్ర కొరకు జిమ్ లో కసరత్తులు చేసి సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నాడని తెలుస్తుంది. లవర్ బాయ్ గెటప్ లో కనిపించే నాగ శౌర్య ఈ లేటెస్ట్ మూవీలో మాస్ హీరో లెక్క రఫ్ లుక్ లో దర్శనమిస్తారేమో చూడాలి. గతంలో జాదూ గాడు చిత్రంలో నాగ శౌర్య రఫ్ లుక్ లో కనిపించారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు