పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన కమ్ బ్యాక్ సినిమాను క్రిష్ లేదా శ్రీరామ్ వేణులో ఎవరో ఒకరు డైరెక్ట్ చేయవచ్చని టాక్. ఈ నెలలోనే సినిమా లాంఛ్ ఉంటుందని అంటున్నారు. అయితే పవన్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తేనే కానీ ఈ వార్తల్ని నమ్మడానికి లేదని చాలామంది అంటున్నారు.
అయితే నిన్న విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ కార్యక్రమంలో మాట్లాడిన పవన్ ప్రభుత్వ పాలన సరిగ్గా ఉంటే తనకు రాజకీయాల్లోకి వచ్చి కష్టపడాల్సిన అవసరమే లేదని, హాయిగా వెళ్లి సినిమాలు చేసుకుంటానని అన్నారు. ఆయన మాటలు విన్న కొందరు ఫ్యాన్స్ కాస్త షాక్ తిని పవన్ రీ ఎంట్రీ లేనట్టే అనుకుంటుంటే.. ఇంకొందరు ప్రభుత్వ పనితీరు సరిగా లేదనే కదా అయన పోరాడుతున్నది, అలాంటప్పుడు సినిమాల్లోకి ఎలా వెళతారు, ఆయన మాటల వెనక అర్థం అదే అంటూ ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నారు.


