నాలుగు కొత్త సినిమాల్ని ప్రకటించనున్న రకుల్

నాలుగు కొత్త సినిమాల్ని ప్రకటించనున్న రకుల్

Published on Nov 5, 2019 9:36 AM IST

Rakul9

రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు, తమిళంతో పాటు హిందీ పరిశ్రమ మీద కూడా అదే స్థాయిలో దృష్టి పెడుతోంది. ఫలితంగా ఆమె చేతి నిండా సినిమాలున్నాయి. ప్రస్తుతం హిందీలో ఆమె చేసిన ‘మర్జవాన్’ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాపై ఆమె చాలానే ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రంతో పాటే ఆమె ఇంకొన్ని సినిమాలకు కూడా సైన్ చేసింది.

ఇలా ఆమె సైన్ చేసిన కొత్త ప్రాజెక్ట్స్ నాలుగున్నాయట. వాటిలో స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ ఈ నెలాఖరున అధికారికంగా ప్రకటిస్తానని అంటోంది రకుల్. ఇక తమిళంలో కమల్ సరసన ‘ఇండియన్ 2’తో పాటు శివ కార్తికేయన్ కొత్త చిత్రంలో కూడా రకుల్ నటిస్తోంది. తెలుగు విషయానికొస్తే త్వరలో మొదలుకానున్న నితిన్, చంద్రశేఖర్ యేలేటి సినిమాలో కథానాయకిగా నటించనుంది. మొత్తం మీద రకుల్ రానున్న యేడాదిలో ఫుల్ బిజీ కానుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు