రొమాంటిక్ గా సాగే ‘చూసీ చూడంగానే’ టీజర్

రొమాంటిక్ గా సాగే ‘చూసీ చూడంగానే’ టీజర్

Published on Nov 6, 2019 11:17 AM IST

chussi

శివ కందుకూరి ని హీరోగా పరిచయం చేస్తూ డైరెక్టర్ శేష్ సింధూ రావ్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘చూసీ చూడంగానే’. వర్ష బొల్లమ్మ, మాళవికా సతీశన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై రాజ్ కందుకూరి నిర్మిస్తున్నారు. కాగా నేడు ఈ మూవీ టీజర్ చిత్ర బృందం విడుదల చేసింది. ఓ అబ్బాయి మరియు ఇద్దరు అమ్మాయిల మధ్య డిఫరెంట్ టైమ్స్ లో నడిచే రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ మూవీ ఉంటుందని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. కాలేజ్ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ మూవీస్ ఈ మధ్య టాలీవుడ్ లో పెద్దగా రావడం లేదు.

దర్శకుడు శేష్ సింధూ రావ్ కాలేజ్ నేపథ్యంలో నడిచే రొమాంటిక్ లవ్ స్టోరీ ని ఈ మూవీలో చూపిస్తారని తెలుస్తుంది. ఒక నిమిషానికి పైగా కల ఈ టీజర్ ఆసక్తికరంగా సాగింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ గోపి సుందర్ ‘చూసీ చూడంగానే’ చిత్రానికి సంగీతం సమకూర్చగా, సిరివెన్నెల, అనంత్ శ్రీరామ్, రామజోగయ్య, విశ్వా సాహిత్యం అందించారు. పవిత్ర లోకేష్,రాజేష్ ఖన్నా, వెంకటేష్ కాకుమాను,అనీష్, గురు రాజ్ ఇతర పాత్రలలో నటించారు. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించనున్నారు.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు