కమల్ హాసన్, శంకర్ కలిసి చేస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. 23 ఏళ్ల క్రితం వచ్చి సంచలనం క్రియేట్ చేసిన ‘భారతీయుడు’ చిత్రానికిది సీక్వెల్. అందుకే సినిమా కోసం దక్షిణాది ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. నిన్నటి వరకు మధ్యప్రదేశ్, గ్వాలియర్ ప్రాంతంలో జరిగిన ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఎందుకంటే రేపు కమల్ హాసన్ యొక్క 64వ పుట్టినరోజు కావడం, సినీ పరిశ్రమలోకి ఆయన ప్రవేశించి 60 ఏళ్లు కావడంతో తమిళనాడులో పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.
ఈ కార్యక్రమానికి హాజరవడం కోసం కమల్ అండ్ టీమ్ చెన్నైకు వచ్చారు. దీంతో షెడ్యూల్ తాత్కాలికంగా వాయిదా పడింది. తిరిగి ఈ నెల 13 నుండి షెడ్యూల్ తిరిగి మొదలవుతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ప్రియా భవాని శంకర్, ఐశ్వర్య రాజేశ్, విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘భారతీయుడు 2’ పేరుతో విడుదల చేయనున్నారు.


